- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హాయ్ నాన్న’ కోసం మా కథను కాపీ కొట్టారు.. సంచలనం సృష్టిస్తున్న నిర్మాత పోస్ట్
నేచురల్ స్టార్ నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన సినిమా ‘హాయ్ నాన్న’(Hi Nanna).

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన సినిమా ‘హాయ్ నాన్న’(Hi Nanna). శౌర్యువ్ దర్శకత్వంలో ఈ మూవీ 2023 డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో రూపొందిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ‘హాయ్ నాన్న’ సినిమా ఎంతో మంది సినీ ప్రియుల హృదయాలు గెలుచుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద రాణించింది. అంతేకాకుండా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ‘హాయ్ నాన్న’ మూవీ మేకర్స్ మా సినిమా స్టోరీ కాపీ కొట్టారని నిర్మాత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య(Pushkara Mallikarjunaiah) తన సినిమా కథను అనుమతి లేకుండా దొంగిలించారని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘హాయ్ నాన్న’ స్టోరీ నేను తెరకెక్కించిన ‘భీమసేన నలమహారాజ’ (Bheemasena Nalamaharaja)మూవీ కథ. మా అనుమతి లేకుండానే తెలుగులో రీమేక్ చేశారని ఫైర్ అయ్యాడు. అలాగే ఇంత చీప్‌గా ప్రవర్తిస్తారనుకోలేదని’’ రాసుకొచ్చారు.
అలాగే హీరో నానిని ట్యాగ్ చేశాడు. అంతేకాకుండా రెండు సినిమాకు సంబంధించిన పోస్టర్లను షేర్ చేశారు. ప్రస్తుతం నిర్మాత పోస్ట్ వివాదానికి దారితీస్తోంది. ఇక అది చూసిన వారంతా ఇన్నాళ్లు వాల్ల కథ అని నమ్మించి ప్రేక్షకులను మోసం చేశారని అంటున్నారు. కాగా, పుష్కర మల్లికార్జునయ్య నిర్మించిన సినిమా విషయానికొస్తే.. అరవింద్ అయ్యర్, ఆరోహి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సరగుర్ తెరకెక్కించారు. దీనిని రక్షిత్ శెట్టి, హేమంత్, మల్లికార్జునయ్య నిర్మించారు. అయితే ‘భీమసేన నలమహారాజ’ 2020లో డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.






