- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ బర్త్ డే స్పెషల్.. ‘డెకాయిట్’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(Dacoit).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(Dacoit). షానీల్ డియో(Shaneil Deo ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఈ మూవీలో యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘డెకాయిట్’ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, మృణాల్ పుట్టినరోజు వస్తుండటంతో మూవీ మేకర్స్ ‘డెకాయిట్’ నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఆగస్టు 1న అయినప్పటికీ ఒక రోజు ముందుగానే ఆమెకు విషెస్ తెలియజేశారు. ఇందులో గన్ పట్టుకుని ముఖం మీద దెబ్బలతో కనిపించింది. అయితే ఇందులో మృణాల్ జూలియట్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






