Sri Gowri Priya: బర్త్‌డే స్పెషల్‌గా పోస్టర్ రిలీజ్.. బ్యూటిఫుల్ లవ్ పెయిర్‌గా ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ

by Chukka Sudharani |

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’.

Sri Gowri Priya: బర్త్‌డే స్పెషల్‌గా పోస్టర్ రిలీజ్.. బ్యూటిఫుల్ లవ్ పెయిర్‌గా ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ
X

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్ ఈ సినిమా కథను అందిస్తుండగా.. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ పుట్టినరోజు సందర్భంగా.. సినిమా నుంచి ఆమె స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇందులో బ్యూటిఫుల్ లవ్ పెయిర్‌గా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో నివి క్యారెక్టర్‌తో శ్రీ గౌరి ప్రియ ప్రేక్షకులకు మరింత చేరువకానుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

Next Story