- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మనకోసం మాత్రమే కాకుండా మన మొత్తం పర్యావరణ వ్యవస్థ ప్రయోజనం కోసం దానిని సంరక్షిద్దాం’: shilpashetty
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పటికే కొంతమంది యోగా దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పటికే కొంతమంది యోగా దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక యోగా చేయడం వలన శారీరకంగా, మానసికంగా ప్రయోజనాలు అనేకం అని చెప్పుకోవచ్చు. యోగా ఆసనాలు, ప్రాణాయామం కండరాలను బలోపేతం చేస్తాయి. అలాగే యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చర్మం, జుట్టుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. యోగా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. ఏకాగ్రతను పెంచుతుంది. ఇంకా యోగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా.. రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రాణాయామం శ్వాసకోశ సమస్యలను నియంత్రిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.
అలాగే యోగా నిద్రలేమిని తగ్గించి.. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. యోగా సృజనాత్మకతను పెంచుతుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. వీటితో పాటుగా యోగా యోగా జీర్ణక్రియను మెరుగుపర్చడం, యోగా చర్మం పొడిబారితే.. ముడతలు తగ్గించడానికి, శక్తి స్థాయిల్ని పెంచడానికి, రోజంతా చురుకుగా ఉండటానికి మేలు చేస్తుంది. కాగా యోగాను క్రమం తప్పకుండా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండవచ్చని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.
అయితే యోగా డే సందర్భంగా పలువురు సోషల్ మీడియా వేదికన పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో నటి శిల్పాశెట్టి కూడా యోగాపై ఓ పోస్ట్ పెట్టింది. యోగా చేస్తోన్న వీడియో పంచుకుని.. ‘‘మనకు ఏదైనా ఒకటి ఉన్నప్పుడు, మనం దానికి విలువ ఇవ్వాలి. ఈ సంవత్సరం ఇతివృత్తం ఒకే భూమికి యోగా, ఒకే ఆరోగ్యం. మనస్సు, శరీరం, ఆత్మ మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి సమతుల్యత కీలకం. యోగాను విలువైనదిగా పరిగణించండి. అంతా ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం. మనకోసం మాత్రమే కాకుండా మన మొత్తం పర్యావరణ వ్యవస్థ ప్రయోజనం కోసం దానిని సంరక్షిద్దాం’’ అంటూ రాసుకొచ్చింది. instagram link






