Sakshi Malik : సినిమా ఆఫర్స్ కోసం బోల్డ్ ఫొటో షూట్‌తో రెచ్చిపోతున్న ముంబై బ్యూటీ.. తట్టుకోలేకపోతున్నాం అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |

ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ (Sakshi Malik) సోషల్ మీడియాలో గ్లామర్ షోతో తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

Sakshi Malik : సినిమా ఆఫర్స్ కోసం బోల్డ్ ఫొటో షూట్‌తో రెచ్చిపోతున్న ముంబై బ్యూటీ.. తట్టుకోలేకపోతున్నాం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ (Sakshi Malik) సోషల్ మీడియాలో గ్లామర్ షోతో తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. మ్యూజిక్ వీడియోలు, మోడలింగ్ అసైన్‌మెంట్స్‌తో పాపులారిటీ పెంచుకున్న ముంబై బ్యూటీ.. నటనపై ఉన్న మక్కువతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇలా కార్తీక్ ఆర్యన్ నటించిన ‘సోను కే టిటు కి స్వీటీ’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ‘బోమ్ డిగ్గీ డిగ్గీ’ అనే పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఆకట్టుకుంది. తర్వాత 2023లో ‘డ్రై డే’ అనే సినిమాలో కనిపించింది. ఇక అప్పటి నుంచే సైలెంట్‌గా ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియా(Social media)లో మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. తన బోల్డ్ ఫొటో షూట్‌లతో యువతను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో ల‌క్షల్లో ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకుంది. ఇలా నిరంతరం.. ఫోటోషూట్లతో వేడెక్కిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అబ్బాయిలను ఆకర్షించే పనిలో పడింది ఈ బ్యూటీ. ‘చెప్పు.. కళ్లతో మాత్రమే చెప్పు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ ఫొటోస్‌లో లైట్ బ్లూ కలర్ ట్రెండీవేర్ ధరించి ఎద, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హాట్ హాట్ వైరల్ కావడంతో ఇంత అందం తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story