The Rajasaab : ది రాజాసాబ్ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. దేవకన్యలా మెరిసిపోతున్న బ్యూటీ

by Chukka Sudharani |

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

The Rajasaab : ది రాజాసాబ్ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. దేవకన్యలా మెరిసిపోతున్న బ్యూటీ
X

దిశ, సినిమా: హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి కేవలం మిక్సిడ్ టాక్‌కే పరిమితం అయింది. ఈ సినిమా కోసం నిధి.. ఎన్నో సినిమా ఆఫర్లను త్యాగం చేసింది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ తన ఆశలన్నీ ‘ది రాజాసాబ్’ (The Rajasaab) పైనే పెట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ హీరోగా నటిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచి బొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ధి కుమార్‌తో పాటు నిధి అగర్వాల్ కూడా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ముందుగానే రాజాసాబ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు చిత్ర బృందం. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో నిధి దేవకన్యలా మెరిసిపోతూ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. లింక్

Next Story