Avantika Mohan: భార్యను కాదు.. తల్లిని అవుతా.. ఫ్యాన్‌కు అమేజింగ్ సలహా ఇచ్చిన హీరోయిన్

by Chukka Sudharani |

చదువుకునే ఏజ్‌లో ఉన్నావు.. నా వెంట పడటం కరెక్ట్ కాదు అంటూ అభిమానికి సలహా ఇస్తుంది హీరోయిన్ అవంతిక మోహన్.

Avantika Mohan: భార్యను కాదు.. తల్లిని అవుతా.. ఫ్యాన్‌కు అమేజింగ్ సలహా ఇచ్చిన హీరోయిన్
X

దిశ, సినిమా: చదువుకునే ఏజ్‌లో ఉన్నావు.. నా వెంట పడటం కరెక్ట్ కాదు అంటూ అభిమానికి సలహా ఇస్తుంది హీరోయిన్ అవంతిక మోహన్ (Avantika Mohan). మలయాళ (Malayalam) నటి అవంతిక మోహన్ తెలుగులో ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే సినిమా నటించింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియా యాక్టీవ్‌గా ఉంటూ ఫొటో షూట్‌లతో అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ అమ్మడు అందానికి ఫిదా అయిన ఓ 17ఏళ్ల అభిమాని ఒక ఏడాది నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ మెసేజులు పెడుతున్నాడట.

ఈ విషయాన్ని తెలుపుతూ ‘నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ నా వెంట పడుతున్న నా చిన్న అభిమానికి నేను ఓ విషయం చెప్పలనుకుంటున్నా. ఏడాది నుంచి నిన్ను పెళ్లి చేసుకోమని నాకు మెసేజులు పెడుతున్నావు. నీది చదువుకునే ఏజ్. చాలా చిన్నవాడివి.. నేను నీ కంటే చాలా పెద్దదాన్ని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు భార్యలా కాదు.. తల్లిలా కనిపిస్తా.. కాబట్టి నువ్వు బుద్ధిగా చుదువుకుని మంచి పొజిషన్‌కు రావాలి. కాబట్టి ఇలాంటివి మానేసి మంచిగా చదువుకో.. నా వెంట పడటం, నాకు ఆ రకంగా మెసేజులు పెట్టడం కరెక్ట్ కాదు.. ఓకేనా’ అంటూ సలహా ఇచ్చంది అవంతిక.

Next Story