టాక్సిక్‌లో విలన్‌గా టొవినో థామస్.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన మలయాళ స్టార్

by Chukka Sudharani |

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ ప్రమోషన్స్‌లో భాగంగా.. టాక్సిక్ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు.

టాక్సిక్‌లో విలన్‌గా టొవినో థామస్.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన మలయాళ స్టార్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ ప్రమోషన్స్‌లో భాగంగా.. టాక్సిక్ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టొవినో థామస్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దానికి ప్రధాన కారణం ‘టాక్సిక్’ పోస్టర్‌ను టొవినో తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడం. దీంతో తను కూడా ఈ మూవీలో భాగం అయినట్లు అంతా భావించారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు టొవినో. ‘టాక్సిక్ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నా అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దర్శకురాలు రాలు గీతూ మోహన్ దాస్ నాకు ఒక సోదరి లాంటిది. అందుకే నేను కేవలం ఆమె పోస్టులను షేర్ చేశాను.. దాంతో నేను ఆ సినిమాలో భాగమని జనం భావించారు. అంతే.. నేను అందులో నటించడం లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.

Next Story