పాతబస్తీ బ్యాక్ డ్రాప్‌లో ‘గల్లీ’.. హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

హీరో సుధీర్ బాబు నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘గల్లీ’ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది.

పాతబస్తీ బ్యాక్ డ్రాప్‌లో ‘గల్లీ’.. హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న ఈ సరికొత్త వెబ్ సిరీస్ ‘గల్లీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా అనౌన్స్ చేస్తూ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లోని పాతబస్తీ గల్లీల నేపథ్యంలో ఒక ‘మోడరన్-డే వెస్ట్రన్’ డ్రామాగా ఈ కథను రూపొందించారు. ఒక హై-స్టేక్స్ గల్లీ క్రికెట్ మ్యాచ్ జరగడానికి ముందు రోజు రాత్రి చోటుచేసుకునే ఉత్కంఠభరిత పరిణామాలు, నేరస్థులు, పోలీసులు, ఆటగాళ్ల మధ్య సాగే దోబూచులాట ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో సుధీర్ బాబు మునుపెన్నడూ చూడని విధంగా చాలా రఫ్ అండ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ సిరీస్‌లో సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి, హన్సిక మోట్వానీ, శ్రద్ధా శ్రీనాథ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక రిలీజ్ చేసిన పోస్టర్ ప్రజెంట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నది.

Next Story