- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గాయపడ్డ సింహం’ లో శ్రీవిష్ణు.. కేవలం స్పెషల్ రోల్ కాదు సీక్వెల్ ప్లాన్‌లో చిత్ర బృందం
హీరో శ్రీవిష్ణుతో గాయపడ్డ సింహం సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

దిశ, సినిమా: తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ చిత్రంపై హ్యూజ్ బజ్ క్రియేట్ కాగా.. తాజాగా రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ ట్రైలర్‌లో హీరో శ్రీవిష్ణు కూడా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇందులో శ్రీవిష్ణు ఓ కామియో రోల్‌లో నటిస్తున్నట్లు అంతా భావించారు. అలాగే ఈ హీరో ఎంట్రీతో 'గాయపడ్డ సింహం' మరింత బలం పుంజుకొన్నట్టైంది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇందులో శ్రీవిష్ణుది గెస్ట్ పాత్ర కాదట. ఈ సినిమాలో ఆయన స్క్రీన్ స్పేస్ 30 నిమిషాల పాటు ఉంటుంది. అలాగే ఈ సినిమా హిట్టయితే.. శ్రీవిష్ణుతోనే సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. దానికి సంబంధించిన లీడ్ కూడా క్లైమాక్స్‌లో చూపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో శ్రీ విష్ణు గెస్ట్ పాత్రలో కనిపించగా.. ఆ మూవీ హిట్ అయింది. ఆ సెంటిమ్మెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా కూడా హిట్ అయ్యే చాన్సెన్స్ ఉన్నట్లు తెలుస్తుండగా.. శ్రీవిష్ణుతో సీక్వెల్ కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.






