- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన భార్య రీఎంట్రీ పై హీరో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ప్రజెంట్ లైఫ్ హ్యాపీగా ఉందంటూ..
ప్రముఖ నటుడు శ్రీకాంత్(Srikanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో విలన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా, స్టార్ హీరోగా మారాడు.

దిశ, సినిమా: ప్రముఖ నటుడు శ్రీకాంత్(Srikanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో విలన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా, స్టార్ హీరోగా మారాడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ లిస్ట్‌లో ఉంటాయి అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సినిమాల్లో బాబాయ్‌గా, పెదనాన్నగా, విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా శ్రీకాంత్ ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. హీరోయిన్ ఊహ(Vooha)తో కొన్ని సినిమాల్లో నటించి.. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక మ్యారేజ్(Marriage) తర్వాత ఊహ మళ్లీ సినిమాల్లో నటించకుండా ఇంటికే పరిమితమయ్యింది. సహజంగా చాలామంది అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు.
ఈ క్రమంలో తన భార్య రీ ఎంట్రీపై హీరో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఊహకి ప్రస్తుతం నటనపై ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా ఇంటర్వ్యూలకు రమ్మంటే బతిమిలాడితే తప్ప రాదు. మొన్న కూడా మా అబ్బాయి రోషన్(Roshan) ఫస్ట్ మూవీ అని వాడి కోసం వచ్చింది. లేకపోతే అసలు తను ఎక్కడికి రాదు. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్ అంటారా.. ప్రస్తుతానికి ఇల్లు, పిల్లలు అంటూ లైఫ్ హ్యాపీగా సాగుతుంది. దీంతో తనకు వేరే వాటిపై ఇంట్రెస్ట్ రావడం లేదు. ఒక వేళ తను రీ ఎంట్రీ ఇచ్చినా ఎవరు ఆపరు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






