2026 మొత్తం నా సినిమా గురించే మాట్లాడుతారు : హీరో శివాజీ

by Sujitha Rachapalli |

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించిన సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

2026 మొత్తం నా సినిమా గురించే మాట్లాడుతారు : హీరో శివాజీ
X

దిశ, సినిమా : లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించిన సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ స‌క్సెస్ మీట్‌లో మాట్లాడిన శివాజీ.. ‘‘హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయ‌టానికి వ‌చ్చారు. నీల‌కంఠ‌గారైతే త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. నార్త్ అమెరికాలో షోలు బాగా పెరిగాయి. ఒక షో పెట్టిన‌వాళ్లు.. మూడు షోస్‌కు పెంచారు. మ‌ల‌యాళ సినిమా డైరెక్ట‌ర్స్‌, మారి సెల్వ‌రాజ్ వంటి డైరెక్ట‌ర్‌తో పోల్చి ముర‌ళీకాంత్ గురించి మాట్లాడుతున్నారంటే.. మాకు చాలా గ‌ర్వంగా ఉంది. సినిమా లాంగ్ ర‌న్‌తో అంద‌రూ మాట్లాడుకునేలా ఉంది. థియేట‌ర్స్‌కు వచ్చి ఆడియెన్స్‌తో నేరుగా మాట్లాడుతాను. నిర్మాత‌కు ప్రేక్ష‌కుల స‌పోర్ట్ ఉండాలి’’ అన్నారు. కార్యక్రమానికి న‌వ‌దీప్, నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని, డైరెక్ట‌ర్ ముర‌ళీకాంత్, బిందు మాధ‌వి, ర‌వికృష్ణ, మౌనిక, అదితి భావరాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story