- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చు.. కానీ ఆయనెప్పుడూ ఫెయిల్ అవ్వలేదు: హీరో రవితేజ
టాలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman S) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman S) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస సినిమాలతో హిట్స్ కొడుతున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఓజీ సినిమాను తమన్ మ్యూజిక్ మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని స్వయంగా ఇండస్ట్రీకి చెప్పిన ప్రముఖులే చెప్పారు. తాజాగా తమన్‌పై, తమన్ మ్యూజిక్‌పై హీరో రవితేజ(Ravi Teja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘సినిమా హిట్టవ్వొచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు.. కానీ తమన్ మ్యూజిక్ ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. నాకు అన్నీ చార్ట్ బస్టర్స్ ఇచ్చాడు. ఈ మధ్య గ్యాప్ వచ్చింది మళ్ళీ తమన్‌తో చేయాలని ఉంది’’ అని రవితేజ చెప్పుకొచ్చారు. రవితేజ హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్. అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. వీడియో






