బర్త్ డే స్పెషల్.. 2026లో డబుల్ ట్రీట్ ఉంటుంది: అడివి శేష్

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అడివి శేష్ బుధవారం తన బర్త్ డే సందర్భంగా నెటిజన్లతో చిట్ చాట్ చేశారు.

బర్త్ డే స్పెషల్.. 2026లో డబుల్ ట్రీట్ ఉంటుంది: అడివి శేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన అడివి శేష్ బుధవారం తన బర్త్ డే సందర్భంగా నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. ఎక్స్ లో అభిమానులు తనను అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా సమాధానాలిచ్చారు. డెకాయిట్, హిట్ 4 సినిమాల గురించే నెటిజన్లు ఆయన్ను ఎక్కువగా ప్రశ్నలడిగారు. ఓ నెటిజన్ డెకాయిట్ షూటింగ్ ఏది కష్టంగా అనిపించిందని అడగ్గా.. ఒకేరోజు మదనపల్లె యాసలో, మరోవైపు హిందీలో డైలాగ్స్ చెప్పడం కష్టంగా అనిపించిందని బదులిచ్చారు. అంటే ఈ సినిమాలో అడివి శేష్ మదనపల్లె బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారంటూ నెటిజన్లలో కకొత్త అంచనాలు మొదలయ్యాయి. అలాగే మృణాల్ యాక్టింగ్ ఈ మూవీలో ఎలా ఉంటుందని మరొకరు అడగ్గా.. సినిమాలో ఆమె చాలా కీలకమని తెలిపారు.

ఇక హిట్ 3 క్లైమాక్స్ లో కనిపించినట్లే.. హిట్ 4లో కూడా కనిపిస్తారా అని మరొక నెటిజన్ అడగ్గా.. ఈ ప్రశ్న డైరెక్టర్ శైలేష్ ను అడగాలని సూచించారు. ఏదైనా వెబ్ సిరీస్ లో నటించే ఆలోచన ఉందా అని అభిమాని ప్రశ్నించగా.. తాను కేవలం థియేట్రికల్ సినిమాలు మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. తమిళ భాష అర్థమవుతుందా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శేష్ చెప్పిన సమాధానం తెలిస్తే కాస్త నవ్వుకుంటారు. రాజా రాణి వంటి సినిమాల్లో తమిళం అర్థమవుతుంది కానీ.. పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాల్లో అది చాలా కష్టమని, తమిళనం నేర్చకోవడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

2026లో G2, డెకాయిట్ సినిమాల రిలీజులతో డబుల్ ట్రీట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడిగిన నెటిజన్ కు.. 100 శాతం ఉంటుందని శేష్ చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చే నెక్స్ట్ జనరేషన్ కు ఏం సజెషన్ ఇస్తారని మరొకరు అడగ్గా.. రాసేటపుడు, యాక్ట్ చేసేటపుడు, సినిమా తీసేటపుడు మొబైల్స్ ఆఫ్ చేసుకోవాలని చెప్తానన్నారు.

Next Story