- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్ట్ బ్రేకింగ్.. ప్రముఖ నటి మృతి.. దహనం చేయొద్దంటూ రోదించిన భర్త(వీడియో)
ప్రముఖ నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. 40ఏళ్ల మోస్ట్ ఫిట్‌నెస్ ఉమన్.. హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం ఏంటని షాక్ అయ్యారు. ఇందుకు కారణం యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అయ్యుండొచ్చని

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. 40ఏళ్ల మోస్ట్ ఫిట్‌నెస్ ఉమన్.. హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం ఏంటని షాక్ అయ్యారు. ఇందుకు కారణం యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అయ్యుండొచ్చని.. చిన్నప్పటి నుంచి ఉన్న మూర్ఛవ్యాధి కూడా రీజన్ కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే షెఫాలీ మరణం తర్వాత ఆమె భర్త చాలా క్యాజువల్‌గా పెట్ డాగ్‌ను వాకింగ్‌కు తీసుకెళ్లడంపై విమర్శలు వచ్చాయి. అసలు ఆయనకు బాధ లేదనే ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఓ హార్ట్ బ్రేకింగ్ వీడియో చూశాక.. ఆయన పర్సనల్ లాస్‌కు సారీ చెప్తున్నారు నెటిజన్లు.
షెఫాలీ దహన సంస్కారాలు చేసే ముందు కుటుంబానికి చివరి సారిగా చూసుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ సందర్భంలో ఆమె భర్త షెఫాలీ మృతదేహాన్ని ముద్దుపెట్టుకుని ఏడ్చాడు. తనను విడిచి వెళ్లొద్దని.. దహనం చేయొద్దని.. గుండెలు అవిసేలా రోదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. మగాళ్లు గుండెల్లోనే భారాన్ని మోస్తారనేందుకు ఇదే నిదర్శనమంటున్నారు జనాలు. రాత్రి నుంచి బిగపట్టుకున్న బాధను చివరి నిమిషంలో బయటపెట్టాడని.. అంతగా ఏడ్చాడని బాధపడుతున్నారు. ఆయనకు ఇది తీరని లోటని.. భగవంతుడు తనకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.






