ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిచ్చిన కుర్ర హీరో.. సోషల్ మీడియాలో ఇదే చర్చ

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-25 17:20:11  IST  )

Havish's Nenu Ready Movie Intense Look Release

ఇంటెన్స్ లుక్‌లో దర్శనమిచ్చిన కుర్ర హీరో.. సోషల్ మీడియాలో ఇదే చర్చ
X

దిశ, సినిమా : యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తోంది. కాగా చిత్ర బృందం క్రిస్మస్ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హవిష్ చాలా హుందాగా.. అదే సమయంలో ఇంటెన్స్ లుక్‌తో కనిపించాడు. చక్కగా దువ్విన జుట్టు, ట్రిమ్ చేసిన గడ్డం, నల్లటి అద్దాల కళ్ళజోడు అతనికి ఒక సీరియస్ లుక్ ఇచ్చాయి. ముదురు రంగు ప్యాంటులో ఇన్ చేసిన చెక్ షర్ట్, ఐడీ కార్డు, భుజంపై వేలాడుతున్న బ్రౌన్ కలర్ ఆఫీస్ బ్యాగ్‌తో అతని లుక్ మిడిల్ క్లాస్ మ్యాన్‌లా వుంది. అతని నిలబడిన తీరు యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నట్లు వుంది. ఇక హైదరాబాద్‌లో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత.. చిత్ర బృందం పాండిచ్చేరిలో హీరో హీరోయిన్లపై సాంగ్ షూట్ పూర్తి చేసింది. ఈ పాటకు విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. సాంగ్ అద్భుతంగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

Next Story