- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజతో ప్రత్యేక బంధం ఉంది.. మాస్ మహారాజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రీమా సేన్
రవితేజ తన బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని, వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన ఎన్నో సహాయాలు చేశారని రీమా సేన్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్లలో రీమా సేన్ ఒకరు. ఉదయ్ కిరణ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, రీమా సేన్ తన నటన, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అనేక సంవత్సరాల పాటు రీమా సేన్ విజయవంతంగా తన సినీ కెరీర్‌ను కొనసాగించింది. తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.
తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, మాస్ మహారాజా రవితేజతో ఉన్న స్నేహబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీమా సేన్ మాట్లాడుతూ.. రవితేజ గారితో నేను పలు చిత్రాల్లో నటించాను. ఆయన ఎంతో సరదాగా ఉంటారు. ఆయన సెట్‌లో ఉంటే చాలు, అక్కడ అందరూ నవ్వుతూ ఆనందంగా ఉంటారు. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో రవితేజ కూడా ఒకరు. కేవలం సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే కాదు, వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన నాకు ఎన్నో సహాయాలు చేశారు. అందుకే ఆయనపై నాకు ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది అని చెప్పుకొచ్చింది.






