- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య సూపర్ కూల్.. కూతురి క్యూట్ కామెంట్స్
లెజెండరీ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. రామ్ చంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చగా..

దిశ, సినిమా : లెజెండరీ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. రామ్ చంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చగా.. హర్షాలి మల్హోత్రా ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించగా.. ఇందుకు సంబంధించిన విశేషాలను పంచుకుంది. బాలకృష్ణతో నటించడం అదృష్టంగా ఫీల్ అవుతానన్న ఆమె.. తాను చేసిన జనని పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పింది.
దాదాపు పదేళ్ల తర్వాత థియేటర్లలోకి వస్తున్నానని.. తన రెండో సినిమానే తెలుగు కావడం ఆనందంగా ఉందని తెలిపింది. బాలకృష్ణ వెరీ కూల్ అని.. తనను ఫ్యామిలీ మెంబర్ లాగానే చేసుకున్నారని.. ఆయన వెరీ ఎనర్జిటిక్ అండ్ అన్‌స్టాపబుల్ అని చెప్పింది. షూటింగ్ టైమ్‌లో మైనస్ డిగ్సీస్ ఉన్న కొన్ని లొకేషన్స్‌లో షూట్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించిందని.. బోయపాటి గారు తనను చాలా ఎంకరేజ్ చేశారని వివరించింది. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడిన హర్షాలి మల్హోత్రా.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని ఉందని.. ఆయన హీరోయిన్‌ను చూపించే విధానం బాగుంటుందని తెలిపింది.






