- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..రెగ్యులర్ ధరలకే వీరమల్లు టికెట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు సినిమా ఈనెల 24వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు సినిమా ఈనెల 24వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించింది. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినప్పటికీ ఆ తరవాత వచ్చిన నెగిటివ్ టాక్ తో కలెక్షన్స్ కాస్త డల్ అయ్యాయి.
అయితే సినిమా టికెట్ ధరలపై పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినిమాను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చిత్రయూనిట్ రెగ్యులర్ ధరలకే టికెట్లను అమ్మాలని నిర్ణయించింది. దీంతో రేపటి నుండే రెగ్యులర్ ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ మేరకు బుక్ మై షో, ఇతర బుకింగ్ వెబ్ సైట్లలో ధరలు తగ్గించి చూపిస్తున్నాయి. టికెట్ ధరలు సాధారణ స్థాయికి చేరడంతో సింగిల్ స్క్రీన్ టికెట్ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.






