Harihara Veeramallu: మా ఫస్ట్ ప్రయారిటీ అదే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ‘వీరమల్లు’ టీమ్ రిక్వెస్ట్

by Chukka Sudharani |

పవర్ స్టార్ పవన్ కల్యాన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది.

Harihara Veeramallu: మా ఫస్ట్ ప్రయారిటీ అదే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ‘వీరమల్లు’ టీమ్ రిక్వెస్ట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) ట్రైలర్‌(Trailer)కు సమయం ఆసన్నమైంది. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi), జ్యోతికృష్ణ (Jyothikrishna) దర్శకత్వం వహించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా పార్ట్-1 జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో జులై-3వ తేదీ ఉదయం 11:10 గంటలకు థియేటర్స్‌లో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఏ విధమైన గందరగోళ పరిస్థితులు ఎదురవ్వకూడాదని ముందు జాగ్రత్త చర్యగా ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ నోట్ రిలీజ్ చేశారు మూవీ టీమ్.

ఈ మేరకు.. మా ఫస్ట్ ప్రయారిటీ మీ సేఫ్టీ.. ఎంజాయ్ చేయండి జాగ్రత్తగా ఉండండి అనే క్యాప్షన్ జోడిస్తూ.. ‘ప్రియమైన పవన్ కల్యాణ్ అభిమానులారా! థియేటర్లలో ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ ట్రైలర్ విడుదల అవుతోన్న కారణంగా.. మీలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా అండ్ జాగ్రత్తగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము. కటౌట్లు ఏర్పాటు చేసేటప్పుడు లేదా ఉత్సవాల్లో పాల్గొనేటప్పుడు.. థియేటర్లకు, లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోండి. మీ భద్రతే ముఖ్యంగా.. మా ప్రియమైన చీఫ్ చాలా కష్టపడుతున్నారు. ‘వీరమల్లు’ యుఫోరియాను హార్ట్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుని మరపురాని జ్ఞాపకాలతో.. సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లండి’ అని చెప్పుకొచ్చారు. LInk

Next Story