‘వీరమల్లు రేంజ్ వేరే’.. భారీ రేట్‌కు ఓటీటీ డీల్ ఖరారు!

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-13 11:52:21  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) కెరియర్‌లో భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu).

‘వీరమల్లు రేంజ్ వేరే’.. భారీ రేట్‌కు ఓటీటీ డీల్ ఖరారు!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) కెరియర్‌లో భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). దీనిని కొంతభాగం క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా, మిగిలిన పార్ట్‌ను కృతికృష్ణ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకున్న చిత్రబృందం డబ్బింగ్ పనుల్లో నిమగ్నమయినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఓటీటీ డీల్ కుదిరిందని.. రైట్స్‌ను ఆమెజాన్ ప్రైమ్(Amazon Prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ నుంచి స్ట్రెయిట్ సినిమా(రీమేక్ కాకుండా) వస్తుండటంతో మంచి రేటే గిట్టుబాటు అయిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ప్రస్తుతం ట్రైల‌ర్ క‌ట్ కోసం క‌స‌ర‌త్తులు షురూ అయ్యాయని.. ట్రైల‌ర్‌తో పాటుగా రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.

పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా ఇది రాబోతోంది. తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి(M.M.Keeravani) స్వరాలు అందిస్తుండగా.. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ మూవీని మే 9న విడుదల చేయాలని భావించారు. అయితే పవన్‌ బిజీగా ఉండడంతో దీని చిత్రీకరణ ఆలస్యం అయింది. చివరకు పవన్ సైతం డేట్స్ ఇచ్చి చిత్రాన్ని పూర్తి చేయడంతో జూన్ మొదటి లేదా రెండో వారంలో విడుదల ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Next Story