Hari teja : బన్నీతో అవకాశం రాగానే 15 రోజులు తిండి మానేశా

by Pulgam srinivas |

Hari Teja : అల్లు అర్జున్ గారి దువ్వాడ జగన్నాథంలో అవకాశం రాగానే చాలా ఆనందపడ్డాను. బన్నీ గారి పక్కన సన్నగా కనిపించడం కోసం 15 రోజులు ఆహారం తినకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నాను అని హరితేజ చెప్పుకొచ్చింది.

Hari teja : బన్నీతో అవకాశం రాగానే 15 రోజులు తిండి మానేశా
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరితేజ ఒకరు. ఈమె చాలా సినిమాల్లో నటించినా, నితిన్ హీరోగా సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన "అ ఆ" ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా హరితేజ మాట్లాడుతూ... "నాకు అల్లు అర్జున్ గారంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశాను. అలాంటి సమయంలో నాకు దువ్వాడ జగన్నాథం చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఛాన్స్ రాగానే ఎంతో ఆనందపడ్డాను. అల్లు అర్జున్ లాంటి గొప్ప నటుడి పక్కన అవకాశం రాగానే నేను సన్నగా కనిపించాలి అనుకున్నాను. దానితో 15 రోజులపాటు ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నాను.

దానితో నేను కాస్త సన్నబడ్డాను, సినిమాలో చాలా బాగా కనిపించాను" అని హరితేజ చెప్పుకొచ్చింది. సినిమాల్లో మంచి స్థాయిలో అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈమె తెలుగు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈమె పెద్ద స్థాయిలో సినిమాలు చేయకపోయినా అడపాదడపా మూవీల్లో నటిస్తూ మంచి దశలోనే కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

Next Story