- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nora Fatehi: కాంచన-4తో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న బోల్డ్ బ్యూటీ.. ఇది నాకు సరైన ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్
మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence) స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కాంచన-4’.

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence) స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కాంచన-4’. ఆయన సొంతం దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ముని’ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ చిత్రాన్ని గోల్డ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీలో నోరా ఫతేహి, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్స్‌గా నటిస్తున్న నెట్టింట వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ చిత్రం బృందం మాత్రం దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
‘రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న కాంచన-4 (Kanchana-4) చిత్రంతో నేను తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమాలోని వచ్చే హారర్ అండ్ కామెడీ సీన్స్‌తో నా నటనను, అలాగే డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడానికి ఇది నాకు సరైన ప్రాజెక్ట్ అని నా అభిప్రాయం. ఈ చిత్రంలో పూజా హెగ్డే, లారెన్స్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది.






