హనుమాన్ 3D వర్షన్ రిలీజ్ డేట్ వచ్చేసింది

by Pulgam srinivas |

హనుమాన్ సినిమా 3D వర్షన్‌ను 2026 జూన్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

హనుమాన్ 3D వర్షన్ రిలీజ్ డేట్ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ చిత్రం 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను 3D వర్షన్‌లో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా 3D వర్షన్‌ను 2026 జూన్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా 3D వర్షన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని, వెన్నెల కిషోర్, గెటప్ శీను, వినయ్ రాయ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.







Next Story