90 పర్సెంట్ ఆక్యుపెన్సీతో "గుర్రం పాపిరెడ్డి"

by Sujitha Rachapalli |

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి

90 పర్సెంట్ ఆక్యుపెన్సీతో గుర్రం పాపిరెడ్డి
X

దిశ, సినిమా : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "గుర్రం పాపిరెడ్డి" సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ వేణు సద్ది మాట్లాడుతూ - ఇది సక్సెస్ మీట్ కన్నా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పే మీట్ అనుకుంటున్నా. "గుర్రం పాపిరెడ్డి" సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. మీలాగే నాకూ ఈ సినిమా బాగా నచ్చింది. మా మూవీలోని ప్రతి ఒక్కరు మంచి ఎఫర్ట్స్ పెట్టి సినిమాను హిట్ చేశారు. అన్నారు.

ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ - నేను ఈ సినిమా చేయడానికి సపోర్ట్ గా నిలిచిన వారు వేణు, సంధ్య, జయకాంత్. వారు లేకుంటే "గుర్రం పాపిరెడ్డి" సినిమా మీ ముందుకు వచ్చేది కాదు. ఇది థ్యాంక్స్ మీట్ గానే భావిస్తున్నాం. సక్సెస్ మీట్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుతా. మా సినిమాలో ఫరియా, నరేష్, రాజ్ కుమార్, వంశీ కామెడీకి ప్రేక్షకులు బాగా నవ్వుతున్నారు. అలాగే మా సినిమాలోని ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెబుతున్నారు. మ్యూజిక్, ఆర్ట్ వర్క్, విజువల్స్..ఇలా అన్నీ క్వాలిటీగా ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ జయకాంత్ (బాబీ) మాట్లాడుతూ - మా "గుర్రం పాపిరెడ్డి" సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు రివ్యూస్ పాజిటివ్ గా వస్తున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ కు రెస్పాన్స్ చాలా బాగుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది పెయిడ్ ప్రీమియర్స్ కు వచ్చారు. థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మీరు ఇంకొంత సపోర్ట్ చేసి మా సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. టికెట్స్ కావాలనుకునే వారికి మా ప్రొడక్షన్ నుంచి నేను అరెంజ్ చేస్తాను. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ - మా సినిమాకు నిన్నటి నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ వారం మొత్తం మీ దగ్గర నుంచి కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ వంశీధర్ కోసిగి మాట్లాడుతూ - "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఫ్రెష్ కంటెంట్ తో వచ్చింది. ఇలాంటి కొత్త తరహా చిత్రాలని ఆదరిస్తే మరిన్ని మంచి మూవీస్ వస్తాయి. థియేటర్ లో సినిమా చూస్తూ నేనూ సర్ ప్రైజ్ గా ఫీలయ్యా. ఒక చిన్న సినిమా ఇంత మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో రావడం అరుదు. సినిమా కోసం ఏది అడిగినా ప్రొడ్యూసర్స్ ఇచ్చారని మా డైరెక్టర్ మురళీ గారు చెబుతుంటేవారు. అందుకే ఇంత క్వాలిటీగా మూవీ వచ్చింది. మా మూవీ ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. మీరు మరింత సపోర్ట్ చేసి ప్రేక్షకులకు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

Next Story