- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒకేసారి రెండు పండగ లాంటి వార్తలు అందే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 27న చరణ్ బర్త్‌డే కానుకగా ఆయన నటిస్తున్న రెండు ప్రతిష్టాత్మక చిత్రాల నుంచి కీలక అప్‌డేట్స్ రానున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ‘RC17’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చరణ్ పుట్టినరోజున ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌తో పాటు షూటింగ్ ప్రారంభ తేదీని కూడా ప్రకటించవచ్చని సమాచారం. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ నుంచి టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు మంచి స్పందన రావడంతో టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సర్‌ప్రైజ్‌ల కోసం మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.






