పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG రిలీజ్ డేట్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఓజీ’(OG).

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG రిలీజ్ డేట్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఓజీ’(OG). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య(DVV Danayya) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్(Arjun Das), శ్రియా రెడ్డి(Sriya Reddy), ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా OG సినిమా నిర్మాత DVV దానయ్య తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “ప్రస్తుతం OG సినిమా ప్రొడక్షన్ జరుగుతుంది. కొంత షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే విడుదలకు రెడీ కానుంది. త్వరలో OG సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం” అని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story