- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Game Changer: మెగా అభిమానులు గుడ్ న్యూస్.. థియేటర్స్‌లో ఇకపై ఆ సాంగ్ కూడా రాబోతుందంటూ మేకర్స్ ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer).

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer). (Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. అయితే ఇందులో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్, అంజలి(Anjali) కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 10న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా మొదటి రోజూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల గ్రాస్ సాధించి బాక్సాఫీసు వద్ద రాణిస్తుంది.
అయితే గేమ్ చేంజర్ సాంగ్ ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది థియేటర్స్‌లో నానా హైరానా సాంగ్ రాకపోవడంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. దీంతో మూవీ మేకర్స్ 14న ఈ సాంగ్ యాడ్ చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ మెగా అభిమానులు గుడ్ న్యూస్ తెలిపారు. సంక్రాంతి(Sankranti)కి రెండు రోజుల ముందుగానే ట్రీట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఈ రోజు నుంచి థియేటర్స్‌లో ‘నానా హైరానా’ సాంగ్ యాడ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టర్(Poster)ను కూడా విడుదల చేయడంతో.. అది చూసిన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
The most awaited “Melody of the year” #NaanaaHyraanaa #JaanaHairaanSa #Lyraanaa is now yours to experience 💜💜
— Game Changer (@GameChangerOffl) January 12, 2025
Adding to theatres from today💯🔥
Watch #GameChanger with your family in a theatre near you 💥
Book your tickets now
🔗 https://t.co/mj1jhGYD9y… pic.twitter.com/CJbH1QgBUs






