- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్(Re Release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్(Re Release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్‌లో బిగ్ హిట్ తెచ్చిపెట్టిన ఓ మూవీ రీరిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు నటించిన ‘అతడు’(Athadu) సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది. ఆ రోజుల్లోనే దాదాపు రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
అయితే ఆయన కెరీర్ లోనే ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అతడును ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రీ బుకింగ్ ఆగస్టు 4 నుంచి స్టార్ట్ కానున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. Link






