షూటింగ్ పూర్తి చేసుకున్న సుధీర్ మూవీ.. వైరల్‌గా ఫొటోస్

by Chukka Sudharani |

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘G.O.A.T’.

షూటింగ్ పూర్తి చేసుకున్న సుధీర్ మూవీ.. వైరల్‌గా ఫొటోస్
X

దిశ, సినిమా: సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘G.O.A.T’. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లోరాబోతున్న ఈ చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, తను నిర్మించిన సినిమాలలో మంచి చిత్రం‌గా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే టీజర్, పాటలు అన్నీ అప్డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story