షాకింగ్ రన్‌టైమ్‌తో ‘డ్రాగన్’ గ్లింప్స్.. రికార్డులు బద్దలవడం పక్కా

by Pulgam srinivas |

'డ్రాగన్' సినిమా గ్లింప్స్ వీడియో ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్ల భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

షాకింగ్ రన్‌టైమ్‌తో ‘డ్రాగన్’ గ్లింప్స్.. రికార్డులు బద్దలవడం పక్కా
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్‌ను ప్రకటించలేదు. అయితే, ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను “NTRNeel” అనే వర్కింగ్ టైటిల్‌తో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్ల భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్లింప్స్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దీనికి “U/A” సర్టిఫికేట్ లభించింది. అంతేకాకుండా, ఇప్పటివరకు భారత సినీ చరిత్రలో ఇంత పెద్ద రన్‌టైమ్‌తో గ్లింప్స్ వీడియో రాలేదని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Next Story