పాత రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘డ్రాగన్’ గ్లింప్స్.. 24 గంటల్లో ఊచకోత

by Pulgam srinivas |

విడుదలైన 24 గంటల్లో డ్రాగన్ గ్లింప్స్ కి 36.74 మిలియన్ వ్యూస్.. అలాగే 475K లైక్స్ లభించాయి.

పాత రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘డ్రాగన్’ గ్లింప్స్.. 24 గంటల్లో ఊచకోత
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. నాలుగు నిమిషాలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లిన ఈ వీడియో పలు రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించింది.

ముఖ్యంగా, విడుదలైన 24 గంటల్లో ఈ గ్లింప్స్ వీడియోకు 36.74 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. అలాగే 475K లైక్స్ కూడా లభించాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే, ‘డ్రాగన్’ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Next Story