వెండితెరపై ఘంటసాల జీవితకథ

by Sujitha Rachapalli |

లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల బయోపిక్‌ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సిహెచ్ రామారావు.. ఘంటసాల గారి జీవితంలోని విభిన్న ఘట్టాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టనట్లు చూపించబోతున్నారు. ప్రివ్యూ షోలతో ఇప్పటికే ఔరా అనిపించిన సినిమా డిసెంబర్ 12న

వెండితెరపై ఘంటసాల జీవితకథ
X

దిశ, సినిమా : లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల బయోపిక్‌ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సిహెచ్ రామారావు.. ఘంటసాల గారి జీవితంలోని విభిన్న ఘట్టాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టనట్లు చూపించబోతున్నారు. ప్రివ్యూ షోలతో ఇప్పటికే ఔరా అనిపించిన సినిమా డిసెంబర్ 12న విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్. ఘంటసాల వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ప్రీవ్యూ షోలు నిర్వహించగా.. అక్కడి భారతీయులు ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఘంటసాల గారి గాత్రం, గౌరవం, మహిమను మరోసారి అనుభవించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన బయోపిక్‌ను ఇంత గ్రాండ్‌గా తెరపై ఆవిష్కరించింనందుకు థాంక్స్ చెప్పారు. కాగా ఈ నెల 5న హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరగనుంది.

Next Story