- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Genelia: అది కష్టమే కానీ అసాధ్యం కాదు.. హీరోయిన్ కామెంట్స్‌పై నెటిజన్ల రియాక్షన్ ఏంటేంటే?
ఒకప్పుడు యూత్ కలల రాణిలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన జెనీలియా (Genelia).. కెరీర్ పీక్స్‌లో ఉండగానే రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది.

దిశ, సినిమా: ఒకప్పుడు యూత్ కలల రాణిలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన జెనీలియా (Genelia).. కెరీర్ పీక్స్‌లో ఉండగానే రితేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత సెకిండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘వేద్’ మూవీతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన జెనిలీయా.. ప్రస్తుతం ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఓ మూవీ చేస్తుంది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ‘సితారే జమీర్ పర్’ (Sitare Jameer Par) అనే సినిమాలో ఆమీర్ ఖాన్ హీరో కాగా.. జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్(Sports backdrop)లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూన్ 20న రిలీజ్ కాబోతుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా పని గంటలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీరు ఎక్కువ టైమ్ షూటింగ్‌లో ఉంటే.. మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనే ప్రశ్నపై జెనీలియా స్పందిస్తూ.. ‘నేను రోజుకు 10 గంటలు షూటింగ్‌లో ఉంటాను. అయితే.. ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు’ అని తెలిపింది. దీంతో జెనీలియా కామెంట్స్‌ను దీపికా పదుకొనే (Deepika Padukone) కామెంట్స్‌తో కంపేర్ చేస్తూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.






