- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gautam Krishna: వీర జవాన్ మురళి నాయక్ బయోపిక్‌లో గౌతమ్ కృష్ణ.. ఇదొక ఎమోషన్ అంటున్న హీరో
‘బిగ్ బాస్’ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై కే సురేష్ బాబు నిర్మిస్తున్నారు. వీర జవాన్ మురళి నాయర్ బయోపిక్‌గా రూపొందబోతున్న ఈ చిత్రాన్ని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు చిత్ర బృందం.
ఈ సందర్భంగా వీర జవాన్ మురళి నాయర్ పాత్రలో నటిస్తున్న నటుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘జై భారత్.. జై మురళి నాయక్.. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది ఒక రియల్ హీరో కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఇప్పటివరకు ఒక్క తెలుగు సైనికుడు మీద కూడా బయోపిక్ రాలేదు. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది. ఈ సినిమాని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నాం. మాకు అవకాశం దొరికితే ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బయోపిక్‌లో నాయక్ పాత్ర పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మురళి నాయక్ నార్మల్ పర్సన్ కాదు. ఆయన సినిమా కూడా మామూలుగా ఉండకూడదు. చాలా అద్భుతంగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి పూర్తి సహకారం ఉంటుందని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. అందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మురళి నాయక్ గారి పేరెంట్స్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఒక కేవలం సినిమా మాత్రమే కాదు. దేశం గర్వపడే ఒక ఎమోషన్’ అని తెలిపాడు.
మురళి నాయక్ తల్లీ, తండ్రి మాట్లాడుతూ.. ‘మురళి ఆపరేషన్ సింధూర్లో విరోచితంగా పోరాడారు. గౌతమ్ బాబు మురళి గురించి మంచి మూవీ తీయాలని, భారతీయులందరికీ గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తీయడానికి మురళి నాయక్ తల్లిదండ్రులుగా మేము అంగీకరిస్తున్నాము. మురళి పాత్రలో గౌతం బాబుని చూడడం మురళి తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ సినిమా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను. జైహింద్’ అని తెలిపారు.






