Gatta Kusthi2 : పూజా కార్యక్రమాలతో హిట్ మూవీ సీక్వెల్ స్టార్ట్.. వైరల్‌గా ఫొటోస్

by Chukka Sudharani |   (  Updated:2025-09-02 16:53:20  IST  )

ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గట్ట కుస్తీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Gatta Kusthi2 : పూజా కార్యక్రమాలతో హిట్ మూవీ సీక్వెల్ స్టార్ట్.. వైరల్‌గా ఫొటోస్
X

దిశ, సినిమా: ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గట్ట కుస్తీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2022లో ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో రిలీజ్ కాగా.. ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్ 2 ప్రకటించారు చిత్ర బృందం. ‘గట్ట కుస్తీ’ సీక్వెల్‌కు చెల్ల అయ్యవ్ దర్శకత్వం వహిస్తుండగా.. వెల్స్ ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి భాగంలో అలరించిన నటీనటులే మరోసారి ఎంటర్‌టైన్ చేయబోతున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అంతే కాకుండా.. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నేడు ఘనంగా జరిగాయి. ఈ విషయంపై టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘మళ్ళీ వెళ్దాం. రెండో రౌండ్‌ ప్రారంభం’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ ఫొటోస్ వైరల్ అవుతుండగా.. మరోసారి ఎంజాయ్ చేయడానికి మేము కూడా సిద్ధం అంటున్నారు నెటిజన్లు. లింక్

Next Story