- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగులోకి ‘గత వైభవం’
గ్రాండ్ ఫాంటసీ విజువల్ వండర్ ‘గత వైభవం’ గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నటించిన ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. దీపక్ తిమ్మప్పతో

దిశ, సినిమా : గ్రాండ్ ఫాంటసీ విజువల్ వండర్ ‘గత వైభవం’ గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నటించిన ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సర్వేగర సిల్వర్ స్క్రీన్స్‌తో కలిసి సునీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్‌గా తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నేతృత్వంలోని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని జనవరి 1న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనుండగా.. న్యూ ఇయర్‌కి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ అనౌన్స్‌మెంట్ సందర్బంగా అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌లో చూపించిననట్లుగా కథ నాలుగు విభిన్న కాలాలలో సాగుతుంది. ఈ చిత్రంలో శివకుమార్, ఉల్లాస్ హైదర్, రఘు మైసూర్ అందించిన ప్రొడక్షన్ డిజైన్‌తో పాటు భారీ నిర్మాణ విలువలు ఉన్నాయి. విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీని అందించగా, జుడా శాండీ అందించిన సంగీతం కథలోని భావోద్వేగ, పౌరాణిక అంశాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది. అత్యాధునిక విఎఫ్ఎక్స్, సౌండ్‌తో పాటు సాగే గొప్ప కథనం అలరించనున్నాయి. ప్రేమ, పురాణం, పునర్జన్మ, చారిత్రక నాటకం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.






