Folk Singer Prabha : ఆ పాటే గుర్తింపును తీసుకువచ్చింది.. నా రెమ్యూనరేషన్ అలా తీసుకుంటాను

by Pulgam srinivas |

సింగర్ ప్రభ మాట్లాడుతూ... ఓ పిల్లగా వెంకటి పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. పాట రాయడానికి, పాడటానికి వేరువేరుగా పారితోషకం తీసుకుంటాను. ప్రయాణ ఖర్చుల కోసం, మరికొంత మిగిలేలా మాత్రమే తీసుకుంటానని ఈమె చెప్పుకొచ్చింది.

Folk Singer Prabha : ఆ పాటే గుర్తింపును తీసుకువచ్చింది.. నా రెమ్యూనరేషన్ అలా తీసుకుంటాను
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్యకాలంలో పల్లె పాటలు పాడే గాయనీ, గాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం భారీగా పెరిగిన తర్వాత అనేక పాటలను రూపొందిస్తున్నారు. అందులో కొన్ని ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. ఫోక్ సాంగ్లలో కొన్ని పెద్ద సినిమాల్లోని పాటలకంటే ఎక్కువ వ్యూస్ను దక్కించుకుంటున్నాయి. దాంతో ఆ పాటల ద్వారా వాటిని నిర్మించిన వారికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. ఇక వారు కూడా నాణ్యత పెంచి అద్భుతంగా పాటలను చిత్రీకరిస్తున్నారు.

పల్లె పాటలు పాడేవారికి మంచి డిమాండ్ నెలకొంది. ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రభ ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో జానపద పాటలు పాడి మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఈ సింగర్ ఒక పాట పాడుతుందంటే చాలు విడుదలకు ముందే దానిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతలా ఈమె తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రభ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తనకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేసింది. తాజాగా ప్రభ మాట్లాడుతూ... జానపద రంగంలోకి రావాలనే ఆసక్తి సై టీవీలో ప్రసారమయ్యే సింగర్ వెర్షన్ పాటలు చూసి కలిగింది.

మొదట్లో వారిలాగే పాడాలని అనిపించేది, కానీ ఆ తర్వాత భయం వేసి వెనక్కు తగ్గాను. నా భర్త ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. సింగర్గా నాకు ఈ స్థాయి గుర్తింపు లభిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఓ పిల్లగా వెంకటి పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఉన్న సింగర్లలో మంగ్లీ గొంతు అంటే చాలా ఇష్టం. పారితోషకం గురించి మాట్లాడుతూ... పాట రాయడానికి, పాడడానికి వేరువేరుగా తీసుకుంటాను. నేను పెద్దగా డిమాండ్ చేయను. అలాగే నేను క్రేజ్ ఉన్న లిరిసిస్ట్ కాకపోవడంతో ప్రయాణ ఖర్చుల కోసం, మరికొంత మిగిలేలా మాత్రమే తీసుకుంటాను అని ఈమె చెప్పుకొచ్చింది.

Next Story