- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కాకుండానే తల్లి అయిన ఫేమస్ ఫోక్ సింగర్..
బిహార్ ఫేమస్ ఫోక్ సింగర్ దేవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా పెళ్లి కాకుండానే కావడం విశేషం. ఉత్తరాఖండ్ రిషికేశ్ ఏమ్స్ హాస్పిటల్‌లో బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పింది. ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా ఇదంతా సాధ్యం కాగా జర్మన్

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ ఫేమస్ ఫోక్ సింగర్ దేవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా పెళ్లి కాకుండానే కావడం విశేషం. ఉత్తరాఖండ్ రిషికేశ్ ఏమ్స్ హాస్పిటల్‌లో బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పింది. ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా ఇదంతా సాధ్యం కాగా జర్మన్ స్పెర్మ్ బ్యాంక్ నుంచి డోనార్ స్పెడ్ వినియోగించారు. ఈ టెక్నాలజీ ద్వారా తల్లి కావాలన్న కల నెరవేర్చుకున్న దేవి.. తనకు పెళ్లిపై నమ్మకం లేదని, కానీ సైన్స్ తనకు తల్లి అయ్యే హక్కు, అవకాశాన్ని ఇచ్చిందని తెలిపింది.
దీంతో ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం, సింగిల్ మదర్‌హుడ్ జర్నీని సొసైటీ యాక్సెప్ట్ చేయడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ట్రెడిషనల్ ఫ్రేమ్ వర్క్ నుంచి ఈ నిర్ణయం తీసుకున్న దేవి స్త్రీలకు స్ఫూర్తిగా మారొచ్చు. దీన్ని ఉమెన్స్ ఫ్రీడమ్ సెలబ్రేట్ చేసుకునే ఇన్సిడెంట్‌గా ట్రీట్ చేయొచ్చు. కానీ మరో వర్గం మాత్రం ఈ విషయాన్ని తప్పు పడుతోంది. కుటుంబ విలువల గురించి ప్రశ్నిస్తుంది. ఏదేమైనా ఒకవేళ మెజారిటీ మహిళలు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే పురుషుడి పాత్ర ఏంటి? రిలేషన్ షిప్స్ సంగతి ఏంటి? ఇకపై ప్రేమ, బాధ్యత, స్వేచ్ఛ అనేవి సైన్స్, సెన్సిటివిటీతో బ్యాలెన్స్ చేయబడుతాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.






