- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ ఫిష్ వెంకట్ అంత్యక్రియలు.. ఎక్కడంటే
టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ స్టార్ నటుడు ఫిష్ వెంకట్ (Fish

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ స్టార్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) నిన్న అర్ధరాత్రి మరణించాడు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాదులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో... చికిత్స పొందుతూ మరణించారు ఫిష్ వెంకట్.
ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ ఆత్మకు శాంతి చేకూరాలని.. టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇది ఇలా ఉండగా... ఫిష్ వెంకట్ మృతి నేపథ్యంలో... ఆయన అంతక్రియలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఫిష్ వెంకట్ అంతక్రియలు (Fish Venkat's funeral ).. హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
ప్రస్తుతం అడ్డగుట్ట లోని ఆయన నివాసం వద్ద...ఫిష్ వెంకట్ పార్తివ దేహాన్ని ఉంచారు. మారేడుపల్లి లోని హిందూ స్మశాన వాటికలో ఫిష్ వెంకట్ అంతక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఫిష్ వెంకట్ పార్థివ దేహాన్ని చూసేందుకు... టాలీవుడ్ సెలబ్రిటీలు వస్తున్నారు.






