నేను బాగానే ఉన్నా.. ఫిష్ వెంకట్ చివరి మాటలు ఇవే..!

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే.. కోట శ్రీనివాసరావు (Kota Srinivas rao) మరణించగా నిన్న

నేను బాగానే ఉన్నా.. ఫిష్ వెంకట్ చివరి మాటలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే.. కోట శ్రీనివాసరావు (Kota Srinivas rao) మరణించగా నిన్న రాత్రి.. ఫిష్ వెంకట్ (Fish Venkat) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ అలాగే లివర్ సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్... ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది. ఈ తరుణంలోనే హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో... నిన్ను అర్ధరాత్రి కన్నుమూశారు ఫిష్ వెంకట్. ఈ తరుణంలోనే ఫిష్ వెంకట్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

వాస్తవానికి ఫిష్ వెంకట్ కుటుంబం దగ్గర వైద్యానికి సరిపడా డబ్బులు లేక ఆయన మరణించినట్లు చెబుతున్నారు. దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఫిష్ వెంకట్ హెల్త్ కోసం అవసరమవుతాయని.. వైద్యులు చెప్పారట. ఈ నేపథ్యంలోనే తమకు ఎవరైనా సహాయం చేయాలని.. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చాలా బతిలాడారు. కానీ పెద్దగా ఎవరు ఆసక్తి చూపించకపోవడంతో... మరణించారు ఫిష్ వెంకట్.

అయితే ఈ నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ చివరిగా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని కూడా ఫిష్ వెంకట్ చెప్పాడట. తనను చూసేందుకు వచ్చిన తోటి మిత్రులు, నటీనటులు, కుటుంబ సభ్యులకు ఇదే విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశాడట. భగవంతుని దయతో తాను కోలుకుంటానని కూడా చెప్పాడట. కానీ ఆయన పరిస్థితి విషమించడంతో... ఫిష్ వెంకట్ మృతి చెందారు.

Next Story