- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fish Venkat: పాపం.. వెంటిలేటర్‌పై ఫిష్ వెంకట్..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఫిష్ వెంకట్ తాజాగా

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ( Fish Venkat) గురించి తెలియని వారు ఉండరు. అయితే ఫిష్ వెంకట్ తాజాగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదని తెలుస్తోంది. ఎన్నో సినిమాలు చేసిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెబుతున్నారు. రెండు కిడ్నీలు కూడా పాడవడంతో... ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారట. వెంటిలేటర్ పైన ఫిష్ వెంకట్ కు వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని... వేడుకుంటున్నారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా... టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలే చేశాడు ఫిష్ వెంకట్. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల సినిమాల్లో కూడా కనిపించాడు. విలన్ పాత్రలో కనిపిస్తూనే... కామెడీ చేసే వాడు. తెలంగాణ యాస భాష లో డైలాగులు అదరగొట్టేవాడు. ఫిష్ వెంకట్ వచ్చాడంటే... ఆ సీన్ మొత్తం జనాలు నవ్వాల్సిందే. అలా ఫిష్ వెంకట్ పాపులర్ అయ్యారు. అలాంటి నటుడు ఫిష్ వెంకట్ ఆసుపత్రి పాలు కావడం పట్ల సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఆయన కోలుకోవాలని కోరుతున్నారు.






