- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. స్టార్ యాక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ హైప్
హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ మూవీలో నటిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ మూవీలో నటిస్తున్నాడు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శివాజీనే స్వయంగా నిర్మాతగా మారి తన శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో లయ (Laya) హీరోయిన్‌గా నటిస్తోండగా ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్, ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రంజిన్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ అప్డేట్ ఇస్తూ స్టార్ యాక్టర్ బండ్ల గణేష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘బండ్ల గణేష్ నేలపైకి వచ్చిన క్షణం, వేదిక మెగా వేడుకగా మారుతుంది.. ఈ సంవత్సరం అతిపెద్ద పాట ఇది రాబోతోంది.. త్వరలో ఫస్ట్ సింగిల్’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో బండ్ల గణేష్ చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






