- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ravi Teja: ‘మాస్ జాతర’ నుంచి తు మేర లవర్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), డైరెక్టర్ భాను భోగవరపు (Bhanu BhogavarapuBhanu Bhogavarapu) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ (Mass Jathara).

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), డైరెక్టర్ భాను భోగవరపు (Bhanu BhogavarapuBhanu Bhogavarapu) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ (Mass Jathara). ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్ లైన్(Tag line)తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree leela) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పలు అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘తు మేర లవర్’ (TuMeraLover) అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రవితేజ క్లాసిక్ పాటలలో ఒకటైన ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇక టైటిల్‌కు తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ హై ఎక్స్‌పెక్టేషన్స్ (High Expectations) మధ్య మే 9న థియేటర్‌లలోకి రానుందని ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చారు. అయితే.. కొన్ని అనివార్య కారణాల చేత ఈ మూవీ వాయిదా పడనుందని నెట్టింట గట్టిగానే టాక్ వినిపిస్తుంది. అలాగే రీసెంట్‌గా నిర్మాత నాగవంశీ కూడా రిలీజ్ వాయిదాపై వస్తున్న వార్తలపై స్పందించి జూలైలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.






