- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thank You Dear: ఈ సినిమా నా కెరీర్‌లో చాలా కీలకమైనది.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ హీరో ధనుష్ రఘుముద్రి నటించిన లేటెస్ట్ మూవీ ‘థాంక్ యూ డియర్’.

దిశ, సినిమా: యంగ్ హీరో ధనుష్ రఘుముద్రి నటించిన లేటెస్ట్ మూవీ ‘థాంక్ యూ డియర్’. హెబ్బా పటేల్, రేఖ నిరోషా, వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లుక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘‘థాంక్ యూ డియర్’ నా రెండో సినిమా. తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ నా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో కీలకమైనది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుంది. తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది’ అని తెలిపారు.






