నీలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం.. రామ్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. స్పెషల్ పోస్ట్

by Mallepaka Hamsa |

జీవితంలో మనకు ఎప్పుడూ ఎవరో ఒకరు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. నిన్ను చూసినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది.

నీలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం.. రామ్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. స్పెషల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తన గ్లామర్, క్యూట్ నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ పాపులారిటీతోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే.. భాగ్యశ్రీ-రామ్ పోతినేని రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమా షూటింగ్ సమయం నుంచే రామ్, భాగ్యశ్రీల మధ్య ఏదో నడుస్తోందని, వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్లపై అటు రామ్ కానీ, ఇటు భాగ్యశ్రీ కానీ ఎప్పుడూ స్పందించలేదు, సైలెంట్‌గా ఉండిపోయారు.

నేడు (మే 15) హీరో రామ్ పోతినేని పుట్టినరోజు కావడంతో, భాగ్యశ్రీ బోర్సే ఆయనకు విష్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో ఆమె తమ మధ్య ఉన్న బంధంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. జీవితంలో మనకు ఎప్పుడూ ఎవరో ఒకరు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. నిన్ను చూసినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది. నీలోని టాలెంట్, ఎనర్జీ చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. నీలాంటి ఒక గొప్ప వ్యక్తి నా పక్కన మంచి స్నేహితుడిగా ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థాంక్యూ సో మచ్. ఈ పుట్టినరోజు నుంచి నీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణం మొదలవ్వాలి. ఈ ఏడాది నువ్వు సాధించే విజయాలు.. అడవిలో సింహం గర్జించినట్లు, ప్రపంచం మొత్తం మార్మోగిపోయేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చింది. భాగ్యశ్రీ పెట్టిన ఈ పోస్ట్‌తో వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లియర్ అయిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రేమ, అఫైర్ వార్తలకు ఒక్కసారిగా చెక్ పడినట్లయింది.

Next Story