- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు
హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికలు నేడు ముగిశాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికలు నేడు ముగిశాయి. మొత్తం 3,355 మంది సభ్యుల్లో 1,417 మంది అనగా సుమారు 43 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో విభాగాల నుంచి అధ్యక్షుడు సహా మొత్తం 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు నిర్వహించారు.
దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు మద్దతు ఉన్న ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు, సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు మద్దతుతో నిలిచిన మన ప్యానెల్‌కు మధ్య హోరాహోరీ పోటీ సాగింది. ఫలితాలు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికలు టాలీవుడ్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






