Fauji Movie: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫౌజీ వచ్చేది అప్పుడే..

by I. Sairam |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘రాజాసాబ్’(Rajaa Saab) మూవీ అంతగా ఆకట్టుకోలేక పోయింది.

Fauji Movie: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..  ఫౌజీ వచ్చేది అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘రాజాసాబ్’(Rajaa Saab) మూవీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో 'ఫౌజీ' ఒకటి. దీనికి ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తుండగా భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక సినిమాలో ప్రభాస్‌కి జంటగా ఇమాన్వి(Imanvi) అనే కొత్త అమ్మాయి నటిస్తుంది.

ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో దేశభక్తితో పాటు ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతుందట. అయితే తాజాగా ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న దాని ప్రకారం ఫౌజీ సినిమాను 2026, దసరాకు రిలీజ్ చేయనున్నారట. అప్పటిలోపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతంఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story