- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇంత ఆకలి మీదున్నారేంట్రా బాబూ’.. వీడియో వైరల్
ఓజీ సినిమా(OG Movie) కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఓజీ సినిమా(OG Movie) కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత నాలుగైదు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఓజీ మీదే హోప్స్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా ఓజీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. ‘బ్లాక్ బస్టర్ హిట్ చేయు దేవుడా’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. వీడియోలు ఎడిట్ చేసి పోస్ట్స్ చేస్తున్నారు. దీంతో ‘ఇంత ఆకలి మీదున్నారేంట్రా బాబూ’ అంటూ మిగతా హీరో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీ కోసం అయినా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. సుజిత్(Sujeeth) దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మించారు. ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించగా, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. వచ్చే సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో ఓజీ సినిమా విడుదల కాబోతోంది. వైరల్ వీడియో






