- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fahadh Faasil : ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్
పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్.. ఇప్పుడు తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు.

దిశ, సినిమా: పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్.. ఇప్పుడు తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీకు సంబంధించిన షూటింగ్‌ను ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. అర్కా మీడియావర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంతో నిర్మాతగా ఎస్ఎస్ కార్తికేయ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. డైరెక్టర్ శశాంక్ యేలేటి ఈ మూవీని బలమైన భావోద్వేగ అంశాలు, కంటెంట్ బేస్డ్‌గా, ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. ఫహాద్ ఫాజిల్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణ కానున్నారు. రిఫ్రెషింగ్, ఓ ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేలా సినిమాని రూపొందిస్తున్నారు. షూటింగ్ స్టా్ర్ట్ చేసిన సందర్భంగా సెట్స్ నుండి వచ్చిన ఒక చిన్న వీడియో క్లిప్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ నాటికి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ భావిస్తుండగా.. ఈ ఏడాది ద్వితీయార్దంలో గ్రాండ్‌గా థియేట్రికల్ విడుదలను టీం ప్లాన్ చేస్తోంది.
- Tags
- Fahadh Faasil






